డిఎన్ఏ అంటే ఏమిటి ? What is DNA in Telugu ?

పరిచయం :

మనుషులలో తెల్లగా, నల్లగా, పొడవుగా, మేధావులుగా ఇలా వివిధ రకాలుగా ఉంటారు. అలాగే జంతువులలో మాంసాహారులు, శాకాహారులు, 2 కాళ్ళు, 4 కాళ్ళు గల జీవులు మరియు భూమి పై, నీళ్లలో నివసించే రక రకాల జీవులను చూసి ఉంటాము.

ఎందుకని మనము మనుషులుగా మారాము అవి జంతువులుగా ఉండిపోయాయి ? ఎందుకని మనము పుట్టినప్పుడు మన అమ్మ నాన్న లాగా కనిపిస్తాము ?

వీటన్నిటికీ సమాధానం డిఎన్ఏ (DNA). ఒక్కో జివి లో ఒక్కో రకమైన డిఎన్ఏ కోడ్ ఉండటం వళ్ళ ఒకరికి మరొకరు పోలిక లేకుండా పుడతారు.

అయితే డిఎన్ఏ గురించి తెలుసుకునే ముందు దీని ఫుల్ ఫార్మ్ ఏమిటి? ఇది మన శరీరంలో ఎక్కడ ఉంటుంది అనే విషయాలు తెలుసుకుందాము.   

డిఎన్ఏ ఫుల్ ఫార్మ్ ఏమిటి ?

డిఎన్ఏ అంటే Deoxyribonucleic acid అని అర్థం. ప్రాణం ఉన్న ప్రతి జీవి లో డిఎన్ఏ ఉంటుంది. డిఎన్ఏ కారణంగానే మనలో ప్రతి ఒక్కరు వేరు వేరు గా కనిపిస్తారు. జంతువులకి, మనుషులకి, మిగతా జీవం ఉన్న అన్ని జీవుల మధ్య తేడాని నిర్ధారిస్తుంది.

డిఎన్ఏ కారణంగానే మనుషులలో పుట్టిన పిల్లలు వాళ్ళ తండ్రిలా కానీ లేదా తల్లిలా కానీ  కనిపిస్తారు.

డిఎన్ఏ లోనే మనకు సంబంధించిన మొత్తం సమాచారం నిల్వ చేయబడి ఉంటుంది. ఉదాహరణకి మన ఎత్తు, వెంట్రుకల రంగు, తెలివి, చర్మం యొక్క రంగు లాంటి విషయాలు మన డిఎన్ఏ నిర్ధారిస్తుంది.

డిఎన్ఏ ఎక్కడ ఉంటుంది? 

 మరి ఇంత ముఖ్యమైన సమాచారాన్ని నిల్వ ఉంచే డిఎన్ఏ శరీరంలో ఎక్కడ ఉంటుందని మీకు సందేహం రావొచ్చు. మన శరీరంలో కొన్ని మిలియన్ల కణాలు ఉంటాయి. ఇవి రోజూ పుడుతూ చనిపోతూ ఉంటాయి. డిఎన్ఏ మన శరీరం లోని కణాలలో ఉండే  నూక్లియస్ లో ఉంటుంది, ఇదే నూక్లియస్ కణాన్ని నియంత్రిస్తుంది.

క్రోమోసోమ్ అంటే ఏమిటి ?

డిఎన్ఏ ఒక నిచ్చెన ఆకారం కలిగిన నిర్మాణం లో ఉంటుంది. ఈ మొత్తం సముదాయాన్ని క్రోమోజోమ్ అంటారు. ఈ క్రోమోజోముల సంఖ్య ప్రతి జీవి లో వేరు వేరుగా ఉంటాయి. ఉదాహరణకు మనుషులలో ఒక్క కణం లో 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. ఇలాగే గుర్రాలలో 64 క్రోమోజోమ్స్ ఉంటాయి. 

ఈ 43 క్రోమోసోములలో 23 మన తండ్రి నుంచి మిగతా 23 తల్లి నుంచి వస్తాయి. ఇలా మొత్తం కలిపి 43 క్రోమోసోములు అవుతాయి.

డిఎన్ఏ కోడ్ అంటే ఏమిటి ?

నిచ్చెన ఆకారంలో ఉన్న ఈ డిఎన్ఏ ఒక కోడ్ తో నిర్మించబడి ఉంటుంది. ఈ  కోడ్ అడెనీన్ (Adenine), గువానిన్ (Guanine), సైటోసిన్ (Cytosine), థైమిన్ (Thymine) అనే రసాయనిక సమ్మేళనాలతో నిర్మించబడి ఉంటుంది. 

వీటినే AGCT అని కూడా అంటారు. ఈ AGCT లు కలిసి డిఎన్ఏ కోడ్ ని తయారు చేస్తాయి. ఉదాహరణకి  AT GC TA అని ఇలా కోడ్ రూపంలో మన డిఎన్ఏ ఉంటుంది. 

ఈ  కోడ్ చాలా పెద్దగా ఉంటుంది ఎంత పెద్దగా అంటే మన భూమి నుంచి ప్లూటో వద్దకు వెళ్లి తిరిగి రా గలదు. 

జీన్ అంటే ఏమిటి ? 

ఇంత పెద్ద డిఎన్ఏ కోడ్  మళ్లీ అనేక భాగాలుగా విభజింప బడి ఉంటుంది. ఇందులో కొన్ని భాగాలు చిన్నవిగా మరి కొన్ని భాగాలు పెద్దవిగా ఉంటాయి. ఈ చిన్న,పెద్ద భాగాలుగా ఉన్న డిఎన్ఏ కోడ్ నే మనం జీన్ (Gene) అని అంటాము. 

ఇప్పటివరకు మనము డిఎన్ఏ ఎక్కడ ఉంటుంది, ఏ ఆకారంలో ఉంటుంది, ఎంత పొడవుగా ఉంటుంది వంటి విషయాలు తెలుసుకున్నాము. ఇప్పుడు డిఎన్ఏ మన శరీరాన్ని ఎలా నియంత్రిస్తుందో తెలుసుకుందాం. 

డిఎన్ఏ మరియు అర్ఎన్ఏ :

డిఎన్ఏ, అర్ఎన్ఏ (RNA) సహాయంతో మన శరీరంలో ప్రోటీన్స్ ను తయారు చేస్తుంది. ఈ ప్రోటీన్స్ మన శరీరంలోని వివిధ మార్పులకు ముఖ్య కారణంగా ఉంటాయి.  

ఈ ప్రోటీన్స్ వల్లనే మనమందరం వేరు వేరు గా కనిపిస్తాము. అంటే ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకమైన డిఎన్ఏ కోడ్ ఉంటుంది. ఏ ఇద్దరిలో ఇది ఒకేలా ఉండదు.  

జెనెటిక్ కోడ్ :

మన జీన్స్ లో కోడ్ రూపంలో ఉన్న  సమాచారాన్ని జెనెటిక్ కోడ్ అని అంటారు. ఉదాహరణకి  పొడవుగా ఉండే వాళ్లలో పెరుగుదలకు దోహదపడే హార్మోన్ ఎక్కువగా ఉండాలి అన్న సమాచారం డిఎన్ఏ లో ఉంటుంది . ఇలాగే పొట్టి గా ఉన్న వాళ్లలో పెరుగుదలకు దోహదపడే హార్మోన్ తక్కువగా ఉండాలి అన్న సమాచారం డిఎన్ఏ లో ఉంటుంది. 

ఈ జెనెటిక్ కోడ్ మనకు మన తండ్రి మరియు తల్లి నుంచి వస్తుంది అందుకే మనము అమ్మ లాగా లేకా నాన్న లాగా కనిపిస్తాము. 

డీఎన్ఏ పరీక్ష :

మన శరీరంలోని ప్రతి కణం లో ఉండే డిఎన్ఏ లో ఈ సమాచారం ఉంటుంది. అందుకే మన శరీరంలోని ఏ చిన్న భాగం ను తీసుకున్న డిఎన్ఏ పరీక్ష చేసి ఆ వ్యక్తి ఏవరో గుర్తు పట్టవచ్చు.

జీవం ఉన్న చాలా జంతువుల డిఎన్ఏ మరియు మన డిఎన్ఏ దాదాపు 90% ఒకేలా ఉంటుంది. ఆ 10% వేరుగా ఉంటడం వళ్ళ మనము మనుషులుగా మారాము వాళ్ళు జంతువులుగా మారారు.

Disclaimer (గమనిక ):

తెలుగు రీడర్ లో చేర్చబడిన సమాచారం కేవలం మీకు ఒక విషయం పై అవగాహన కలిగించటానికి మాత్రమే ఇవ్వబడుతుంది. ఇక్కడ ఇవ్వబడిన సమాచారం డాక్టర్ మరియు హాస్పిటల్ కి ప్రత్యామ్నాయం కాదు. పై తెలుపబడిన సమాచారం  క్షుణ్ణంగా పరిశీలించి, ఆయా విభాగాలలో ఉన్న నిపుణుల సోర్సెస్ ద్వారా  వెబ్ సైట్ లో రాయడం జరుగుతుంది. మీకు వ్యక్తిగతంగా వచ్చే సందేహాలను దూరం చేయటానికి దయచేసి డాక్టర్ తో సంప్రదించండి.  

 

6 Comments

  1. Superb infermation. We are expecting more like this we would like know about of dna modification replication so can you plz help us

Leave a Reply

Your email address will not be published.