కోడి ముందా లేదా గుడ్డు ముందా ? శాస్త్రవేత్తలు తేల్చిన సమాధానం.

Telugureader.com

కోడి ముందా లేక గుడ్డు ముందా? ఈ సామెతను చాలా సార్లు వినే ఉంటారు. కోడి ముందు అని అనుకుంటే గుడ్డు లేకుండా కోడి ఎలా పుట్టిందని కొందరు, గుడ్డు ముందు అని అనుకుంటే కోడి లేకుండా గుడ్డు ఎలా వచ్చిందని మరి కొందరు అంటారు. 

కొన్ని సంవత్సరాల నుండి ఈ విషయం పైన చాలా మంది తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేసారు అయితే శాస్త్రవేత్తలు ఈ అంశం పైన ఒక నిర్ధారణకు వచ్చి ఈ ప్రశ్నకు పరిష్కారం ఇచ్చారు. 

శాస్త్రవేత్తలు ఈ సమాధానాన్ని వెతకడానికి పూర్వం నివసించిన మరియు అంతరించి పోయిన జీవ జాతుల గురించి చదవడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో వీరి కి తెలిసిన ఒక విచిత్ర విషయం ఏమిటంటే గుడ్లు పెట్టే జంతువులూ 34 కోట్ల సంవత్సరాల క్రితం  నుండి ఉన్నాయి కానీ  కోడ్లు మాత్రం 58,000 సంవత్సరాల నుంచి మాత్రమే ఉన్నట్లు తెలిసింది.

 ఈ పరిశోధన ప్రకారం కోడ్లు మిగతా జంతువుల లాగా ముందు నుంచి జీవించి లేవు మధ్యలో వచ్చాయి, అదెలా సాధ్యం అని అనుకుంటున్నారా ? అయితే ఈ ప్రశ్నకు శాస్త్రవేత్తలు ఇచ్చే సమాధానం ఏంటంటే మ్యుటేషన్ (Mutation). 

మ్యుటేషన్ అంటే ఏమిటి ?  

మ్యుటేషన్ అనేది డిఎన్ఏ లో కలిగే మార్పుల వళ్ళ కలుగుతుంది. డిఎన్ఏ లో మార్పులు ఎందుకు వస్తాయి ? అసలు డిఎన్ఏ అంటే ఏమిటి ?

డిఎన్ఏ మన శరీర కణాలలో ఉంటుంది, ఒక మనిషి రంగు, ఎత్తు, వెంట్రుకల రంగు, మేధస్సు వంటి లక్షణాలు ఎలా ఉండాలో అనే సమాచారం డిఎన్ఏ లో దాగి ఉంటుంది.
డిఎన్ఏ లో ఏదైనా మార్పులు జరిగినప్పుడు ఆ మార్పు మ్యుటేషన్ కి దారి తిస్తుంది. ఈ మార్పులు సంతానం కలిగేటప్పుడు లేదా పర్యావరణ మార్పుల వళ్ళ కానీ జరుగుతాయి.  

శాస్త్రవేత్తల నమ్మకం ఏంటంటే, వేల సంవత్సరాల క్రితం జీవులు గుడ్లు పెట్టినప్పుడు  ఆ గుడ్లలో కలిగిన మ్యుటేషన్ వళ్ళ కోడ్లు జన్మించాయి. ఈ సిద్ధాంతం ప్రకారం ముందు కోడి గుడ్డు వచ్చింది ఆ తరవాతే కోడి వచ్చింది.  

ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం ఎగ్ షెల్  అంటే గుడ్డు పై ఉండే పెంకు తయారీ కి కావలసిన ప్రోటీన్ కూడా కోడి లో మాత్రమే ఉంటుంది.

దీన్ని బట్టి గుడ్డు ముందు వచ్చింది కోడి తరవాత వచ్చింది. ఇప్పుడు మీకు ఎవరైనా అడిగితే ధైర్యంగా చెప్పండి.  

Disclaimer (గమనిక ):

తెలుగు రీడర్ లో చేర్చబడిన సమాచారం కేవలం మీకు ఒక విషయం పై అవగాహన కలిగించటానికి మాత్రమే ఇవ్వబడుతుంది. ఇక్కడ ఇవ్వబడిన సమాచారం డాక్టర్ మరియు హాస్పిటల్ కి ప్రత్యామ్నాయం కాదు. పై తెలుపబడిన సమాచారం  క్షుణ్ణంగా పరిశీలించి, ఆయా విభాగాలలో ఉన్న నిపుణుల సోర్సెస్ ద్వారా  వెబ్ సైట్ లో రాయడం జరుగుతుంది. మీకు వ్యక్తిగతంగా వచ్చే సందేహాలను దూరం చేయటానికి దయచేసి డాక్టర్ తో సంప్రదించండి.  

2 Comments

  1. గుడ్డు ముందు వచ్చినట్లయితె దాని యొక్క పరిణామ క్రమం తెలియచేయగలరు.

Leave a Reply

Your email address will not be published.