మన శరీరం 60 % నీళ్లతో నిండి ఉంటుంది. ఈ నీరు చెమట, మూత్రం రూపం లో మన శరీరం నుండి బయటకి వెళుతుంది. అందుకే ఎప్పుడు మనం మన శరీరాన్ని డిహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడానికి ఎన్ని నీళ్లు తాగాలి అని మనలో చాలామందికి ఈ డౌట్ వస్తుంది.
మనలో చాలా మంది ఒక రోజులో 2 లీటర్ల నీళ్ళని తాగాలని విని ఉంటారు. కానీ శాస్త్రవేత్తల ప్రకారం మరియు వాళ్ళు చేసిన రీసెర్చ్ ప్రకారం కొన్ని మనకు తెలియని విషయాలు కనిపెట్టారు. మనము రోజు తినే ఆహార పదార్తలలో 20 % నీరు ఉంటుంది. ఉదాహరణకి పండ్లు, కూరగాయలు నీటిని కలిగి ఉంటాయి. పుచ్చకాయ లో 90 % నీరు ఉంటుంది.
ఇలాగే మనము రోజు తాగే టీ, కాఫీ, జ్యూస్ లలో కూడా నీరు ఉంటుంది. ఇలా ఒక రోజులో ఆహారపదార్తల ద్వారా మన శరీరం హైడ్రేట్ అవుతూ ఉంటుంది. ఇంకో ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎక్కువ నీరు తాగడం కూడా చాలా ప్రమాదకరం.
మన మూత్రపిండాలు ఒక రోజులో 20 నుండి 28 లీటర్ల నీళ్ళని ఫిల్టర్ చేయగలదు. కానీ ఒక గంటలో ఒక లీటర్ కన్న ఎక్కువ ఫిల్టర్ చేయలేదు. మన సెల్స్ లో సోడియం పొటాషియం ఎలెక్ట్రోలైట్స్ ఉంటాయి. ఈ ఎలెక్ట్రోలైట్స్ మనము తాగే నీళ్లలో కూడా ఉంటాయి. వీటిని మన మూత్రపిండాలు ఫిల్టర్ చేస్తూ ఉంటాయి కానీ ఒక లిమిట్ వరకు మాత్రమే ఫిల్టర్ చేయగలవు నీరు ఎక్కువగా తాగినట్లైతే ఎలేక్ట్రోలైట్స్ కూడా ఎక్కువగా మన శరీరంలో చేరుతాయి. మూత్రపిండాలు కూడా వీటిని ఫిల్టర్ చేయలేవు. అప్పుడు ఈ ఎలెక్ట్రోలైట్స్ మన సెల్స్ లో ప్రవేశిస్తాయి ఫలితంగా సెల్స్ సైజు పెరుగుతుంది మరియు సెల్స్ వాపు కు గురి అవుతాయి.
దీనివల్ల మన మెదడు లోని సెల్స్ కూడా వాపు కి గురి అవుతాయి. ఇలా అవ్వడం వాళ్ళ మనము చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. అందుకే నీటిని ఎక్కువగా ఒకేసారి ఎక్కువగా తాగడం ప్రమాదకరం. అందుకని మనకు ఎప్పుడైతే దాహం వేస్తుందో అప్పుడు కానీ లేకపోతె చెమట ఎక్కువగా వచ్చినప్పుడు కానీ ఎక్కువగా నీటిని తాగడం వాళ్ళ హైడ్రాటెడ్ గా ఉంటాము. నీళ్లు ఒక లిమిట్ లో తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. 500 ml వాటర్ తాగడం వాళ్ళ జీవక్రియ ను 20 నుంచి ౩౦ % వరకు బూస్ట్ చేస్తుంది.
Disclaimer (గమనిక ):
తెలుగు రీడర్ లో చేర్చబడిన సమాచారం కేవలం మీకు ఒక విషయం పై అవగాహన కలిగించటానికి మాత్రమే ఇవ్వబడుతుంది. ఇక్కడ ఇవ్వబడిన సమాచారం డాక్టర్ మరియు హాస్పిటల్ కి ప్రత్యామ్నాయం కాదు. పై తెలుపబడిన సమాచారం క్షుణ్ణంగా పరిశీలించి, ఆయా విభాగాలలో ఉన్న నిపుణుల సోర్సెస్ ద్వారా వెబ్ సైట్ లో రాయడం జరుగుతుంది. మీకు వ్యక్తిగతంగా వచ్చే సందేహాలను దూరం చేయటానికి దయచేసి డాక్టర్ తో సంప్రదించండి.
Good information . One doubt.
If water can filter 1 litr per hour . On day time can we take more water ?