మన శరీరం మొత్తం బరువు లో 2 % మెదడు బరువు ఉటుంది. కానీ మన మెదడు 20 % ఆక్సిజన్ మరియు క్యాలోరీస్ ని ఉపయోగిస్తుంది.
మనలో చాలా మంది మనము 10 % మెదడు ని వినియోగిస్తాం అని అనుకుంటారు. ఒకవేళ 100 శాతం మెదడుని వినియోగిస్తే మనము కూడా చాలా పెద్ద మేధావులు అయిపోతామని అనుకుంటారు.
ఇదే విషయాన్నీ కొన్ని హాలీవుడ్ మూవీస్ లో కూడా చూపించారు అది చూసి చాలా మంది నిజాము అని అనుకున్నారు. ఒకవేళ మనము 10 శాతం మెదడుని వినియోగించనట్లైయితే మరి ఎంత శాతం మనము వినియోగిస్తాము ?
నిజానికి ప్రతి మనిషి 100 శాతం మెదడు ని వినియోగిస్తాడు. ఈ విషయాన్నీ శాస్త్రవేత్తలు పలు రకాల ప్రయోగాలు చేసి కనిపెట్టారు. దాంట్లో (MRI) Magnetic resonance imaging పద్దతిని ఉపయోగించి మన మెదడుని అధ్యయనం చేసారు.
ఈ ప్రయోగం తో శాస్త్రవేత్తలకు ఒక అద్భుత విషయం తెలిసింది అదేంటంటే మన మెదడు లోని ఏ ఒక్క చిన్న భాగం కూడా నిద్రావస్థలో ఉండదు, మొత్తం మెదడు ఎప్పుడూ చురుకుగా పనిచేస్తూ ఉంటుంది. చివరికి మనము పడుకున్నప్పుడు కూడా మన మెదడు చురుకుగా పని చేస్తూనే ఉంటుంది.
ఒకవేళ 10 % అని వాదిస్తున్న వాళ్ళు కరెక్ట్ అని అనుకుంటే , ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మెదడు కి చిన్న దెబ్బ తగిలిన తర్వాత కూడా సరిగా పనిచేయాలి. కానీ వాస్తవానికి మెదడుకి చిన్న పాటి దెబ్బ తగిలిన దాని ప్రాభవం చాలా ఎక్కువగా ఉంటుంది. జ్ఞాపక శక్తి కోల్పోవడం, పిచ్చివాళ్లలా మారిపోవడం, మనుషులని గుర్తుపట్టక పోవడం వంటి భయంకర పరిణామాలకు దారి తీస్తుంది.
మన మెదడు లోని వేరు వేరు భాగాలు వేరు వేరు పనులని చేస్తూ ఉంటాయి. అందుకే ఈ విషయాలన్నింటిని గమనించిన తర్వాత శాస్త్రవేత్తలు తేల్చి చెప్పిన విషయం ఏంటంటే ప్రతి మనిషి 100 శాతం మెదడు ని ఉపయోగిస్తాడు. మరి మీకు ఒక సందేహం తప్పకుండ రావొచ్చు, ఎందుకని మరి చాలా మంది మొద్దులుగా ఉంటరారు అని. నిజానికి ఎవరు ఎంత మెదడుని వినియోగిస్తే వాళ్ళ మెదడు అంత బాగా పనిచేస్తుంది.
ఒకవేళ మనము మన మెదడు ని చురుకుగా చేయాలి అనుకుంటే ఆరోగ్యకరమైన ఆహారం , కూరగాయలు , వ్యాయామం లాంటివి చేయడం వాళ్ళ మనం కూడా మేధావులు గా మారే అవకాశం ఉంది.
Disclaimer (గమనిక ): తెలుగు రీడర్ లో చేర్చబడిన సమాచారం కేవలం మీకు ఒక విషయం పై అవగాహన కలిగించటానికి మాత్రమే ఇవ్వబడుతుంది. ఇక్కడ ఇవ్వబడిన సమాచారం డాక్టర్ మరియు హాస్పిటల్ కి ప్రత్యామ్నాయం కాదు. పై తెలుపబడిన సమాచారం క్షుణ్ణంగా పరిశీలించి, ఆయా విభాగాలలో ఉన్న నిపుణుల సోర్సెస్ ద్వారా వెబ్ సైట్ లో రాయడం జరుగుతుంది. మీకు వ్యక్తిగతంగా వచ్చే సందేహాలను దూరం చేయటానికి దయచేసి డాక్టర్ తో సంప్రదించండి.
Leave a Reply