డిఎన్ఏ లో ఉండే చిన్న చిన్న భాగాలనే జీన్ అని అంటాము. ఈ జీన్స్ మనకు మన తల్లి తండ్రుల నుంచి వారసత్వంగా వస్తాయి.
జీన్స్ యొక్క సైజు వేరు వేరు గా ఉంటుంది. కొన్ని జీన్స్ చిన్నగా అంటే కొన్ని వందల డిఎన్ఏ బేసెస్ తో ఉంటే కొన్ని జీన్స్ పెద్దగా 2 మిలియన్ల కన్న ఎక్కువ డిఎన్ఏ బేసెస్ కలిగి ఉంటాయి.
ఈ చిన్న మరియు పెద్ద జీన్స్ లను కలిపి మనము DNA అని పిలుస్తాము. మన శరీరంలో మొత్తం 20,000 నుంచి 25,000 జీన్స్ ఉంటాయి.
ఈ జీన్స్ ఒక జీవి యొక్క లక్షణాల కోసం సూచనలను కలిగి ఉంటాయి. ఉదాహరణకి మనిషి యొక్క ఎత్తు, వెంట్రుకల రంగు లాంటివి ఎలా ఉండాలి అనే సమాచారం కలిగి ఉంటుంది.
జీన్ ఒక జీవి కి అవసరమయ్యే ప్రత్యేక ప్రోటీన్లను తయారు చేయడానికి కావాల్సిన సమాచారం కలిగి ఉంటుంది. జీన్స్ వివిధ రూపాలలో ఉంటాయి వీటినే అల్లెల్స్ (Alleles) అని అంటాము.
మన శరీరంలో 23 క్రామోసోముల జత ఉంటుంది. ఒక్కో జతలో ఒక్కో రకమైన అల్లెల్స్ ఉంటాయి. ఉదాహరణకి మన వెట్రుకల రంగును నిర్ధారించే అల్లెల్ ఒక క్రామోసోమ్ లో నల్లగా మరియు ఇతర క్రామోసోమ్ లో బ్రౌన్ రంగు గా ఉండొచ్చు.
ఈ అల్లెల్స్ లో ఒకటి మాత్రమే చివరికి నిర్దారించబడుతుంది. అందుకే పుట్టిన తరవాత కొంతమంది అమ్మ లాగా కనిపిస్తే మరికొంత మంది నాన్న లాగా కనిపిస్తారు.
ఒక్క మాటలో చెప్పాలంటే జీన్ మన DNA లోని ఒక చిన్న భాగం, వీటి వల్లనే ఒక మనిషి యొక్క లక్షణాలు నిర్ధారించబడతాయి.
Sources :
https://medlineplus.gov/genetics/understanding/basics/gene/
https://www.genome.gov/genetics-glossary/Gene
https://www.yourgenome.org/facts/what-is-a-gene
Leave a Reply