కో – విన్ ఆప్ అంటే ఏమిటి ? – What is Co win app ?

Image by iXimus from Pixabay

కరోనా వైరస్ భయంకరంగా సంక్రమిస్తున్న సమయంలో భారతదేశ ప్రభుత్వం ఆరోగ్యసేతు (Arogyasetu) ఆప్ ను లాంచ్ చేసింది.

ఈ ఆప్ ను వినియోగించి కరోనా బారిన పడ్డ వ్యక్తుల వివరాలను చూడగలిగే వాళ్ళం. చాలా వరకు సంస్థలు ఈ ఆప్ ను తప్పకుండా ఇన్స్టాల్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసారు.

కో విన్ :

ఇప్పుడు చాలా దేశాలు వ్యాక్సిన్ ను తమ తమ దేశాలలో ఇవ్వటం మొదలు పెట్టారు. భారత దేశంలో కూడా వచ్చే నెలలో అంటే జనవరి లో ఈ ప్రక్రియను మొదలుపెట్టబోతున్నారు.

మన దేశంలో చాలా జనాభా ఉన్న కారణం తో ఎవరు వ్యాక్సిన్ వేయించుకున్నారు, ఎవరు వేయించుకోలేదు అనే వివరాలు సేకరించటం చాలా కష్టం.

ఇప్పుడున్న పరిస్థితులలో ప్రతి ఒక్కరు ఈ ఆప్ ద్వారా తమ తమ వ్యాక్సిన్ కి సంబంధించిన వివరాలను నమోదు చేయాలని భారత ప్రభుత్వం ఈ ఆప్ ను లాంచ్ చేయబోతుంది.

ఈ ఆప్ ఇంకా ఆప్ స్టోర్ లో విడుదల చేయలేదు. త్వరలో ఆప్ఈ స్టోర్ నుంచి ఈ ఆప్ ను అందరు ఇన్స్టాల్ చేసుకోగలరు.

ఈ ఆప్ లో అడ్మినిస్ట్రేటర్ మోడ్యూల్, రిజిస్ట్రేషన్ మోడ్యూల్, వాక్సినేషన్ మోడ్యూల్, బెనెఫిషరీ అక్నౌలెడ్జిమెంట్ మోడ్యూల్ మరియు రిపోర్ట్ మోడ్యూల్ అనే 5 మోడ్యూల్ లు ఉంటాయని హెల్త్ సెక్రటరీ రాజేష్ భూషణ్ తెలిపారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.