మనుషులు వారి జీవితకాలంలో 1/3 (౩౩ % ) వ వంతు నిద్రపోతారు. నిద్ర ప్రతి ఒక్కరికి చాలా అవసరం. నాణ్యత కలిగిన నిద్ర వల్ల మన శరీరం మరమ్మత్తు చేయబడుతుంది.
ఇవే కాకుండా మానసికంగా , భౌతికంగా, మరియు గుండె, మెదడు ని కూడా చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇంకా కొత్తగా ఆలోచింప చేయడానికి శక్తిని , చేసే పనుల సామర్థ్యంని పెంచడానికి దోహద పడుతుంది. ఇంకా మన బరువు ని కూడా నియంత్రిస్తుంది.
ఈ మంచి ప్రయోజనాలని పొందాలంటే మనం ఎంత సేపు తప్పకుండ నిద్రపోవాలి ? National Sleep Foundation ప్రకారం వయసు ప్రకారంగా చూసినట్లైతే ౩ నుంచి 5 సంవత్సరాల వాళ్ళు 10 నుంచి 13 గంటలు, 14 నుంచి 17 సంవత్సరాల వాళ్ళు 8 నుంచి 10 గంటలు, 18 నుంచి 25 సంవత్సరాల వాళ్లు 7 నుంచి 9 గంటలు, 26 నుంచి 64 సంవత్సరాల వాళ్లు 7 నుంచి 9 గంటలు తప్పకుండా నిద్రపోవాలి.
కొన్ని అధ్యయనాల ప్రకారం కొంత మందిలో వాళ్లలో ఉండే జన్యువుల వల్ల వాళ్ళకి ఆరు గంటల నిద్రనే సరిపోతుంది. ఈ రకమైన జన్యువులు చాలా అరుదుగా ఉంటాయి అందుకే ఇవి కేవలం ౩ శాతం వాళ్లలో మాత్రమే ఉంటుంది. కానీ మిగతా 97 శాతం వాళ్ళు ఇలా తక్కువ పడుకోవటం మొదలుపెడితే దుష్ప్రభావాలు కలుగుతాయి.
తక్కువ నిద్రపోవడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. వాటిలో ఏకాగ్రత కలగకపోవడం, ఆలోచించే శక్తి, సమస్యలను పరిష్కారం చేసే సామర్థ్యము తగ్గిపోతుంది. ఇంతేకాకుండా పగటి పూట మనం నేర్చుకున్న విషయాలు గుర్తు ఉండకుండా పోతాయి.
ఇంకా గుండె నొప్పి, మధుమేహ వ్యాధి, అధిక రక్త పోటు, బరువు పెరుగుట, సంతోషంగా ఉండకపోవడం లాంటివి జరుగుతాయి మరియు చర్మం వయసును పెంచుతుంది అంటే చర్మము ముసలి వాళ్ళలా కనపడుతుంది. సెక్స్ జీవితం కూడా దెబ్బతింటుంది. ఇవే కాకుండా త్వరగా చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి.
అలా అని ఎక్కువ పడుకునే వాళ్లు మేము సురక్షితం అని అనుకుంటే చాలా తప్పుగా ఆలోచిస్తున్నారు. ఎవరైతే ఎక్కువగా పడుకుంటారో వాళ్ళు కూడా చాలా రకాల దుష్ప్రభావాలకు గురి అవుతారు. వాటిలో మధుమేహ వ్యాధి, ఊబకాయం , తలనొప్పి, సంతోషంగా ఉండకపోవడం, వెన్నునొప్పి, గుండె కి సంభందించిన వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. చివరికి మరణించే రేటుని పెంచుతుంది.
కొన్ని లక్షణాలని బట్టి మనం తక్కువగా నిద్రపోతున్నామని తెలుసుకోవచ్చు. ఉదయం అలారమ్ లేకుండా లేవకపోవడం, మీటింగ్స్ మరియు క్లాసుల మధ్య పడుకోవటం, రాత్రి పడుకోగానే నిద్రలోకి వెళ్ళటం లాంటి లక్షణాలన్నీ మనం తక్కువగా పాడుకుంటున్నామని అర్థము.
ఇక ఎక్కువగా పడుకునే వాళ్లలో రాత్రి చాలా సేపు తరవాత నిద్రరావటం, బరువు పెరగటం,పగలు మొత్తం బలహీనంగా ఉండటం లాంటివి కలుగుతాయి. అందుకే ప్రతి రోజు నాణ్యత మైన నిద్ర మనందరికీ చాలా మంచిది.
Disclaimer (గమనిక ):
తెలుగు రీడర్ లో చేర్చబడిన సమాచారం కేవలం మీకు ఒక విషయం పై అవగాహన కలిగించటానికి మాత్రమే ఇవ్వబడుతుంది. ఇక్కడ ఇవ్వబడిన సమాచారం డాక్టర్ మరియు హాస్పిటల్ కి ప్రత్యామ్నాయం కాదు. పై తెలుపబడిన సమాచారం క్షుణ్ణంగా పరిశీలించి, ఆయా విభాగాలలో ఉన్న నిపుణుల సోర్సెస్ ద్వారా వెబ్ సైట్ లో రాయడం జరుగుతుంది. మీకు వ్యక్తిగతంగా వచ్చే సందేహాలను దూరం చేయటానికి దయచేసి డాక్టర్ తో సంప్రదించండి.
Leave a Reply