మనలో చాలా మంది మన ఇంట్లో ఉండే ఎలుకలను గమనించి ఉంటారు. పప్పు ధాన్యాలను తినడం, బట్టలను కొరకడం, ఇతర సామానులను బాగా నష్టం చేస్తూ ఉంటాయి. దాదాపు ఎవ్వరికి కూడా ఎలుకలంటే ఇష్టం ఉండదు కానీ ఇవే ఎలుకలు మనకు వచ్చే రోగాలను నయం చేయడానికి ఉపయోగపడతాయి.
ఈ మాట విని మీకు ఆశ్చర్యం కలగవచ్చు కానీ ఎలుకల DNA మరియు మానవుల DNA దాదాపు ఒకేలా ఉంటుంది. అందుకే మనుషులలో వచ్చే రోగాలను పసిగట్టడానికి మరియు వాటికి మందులను కనిపెట్టడానికి ఎలుకల సహాయం తీసుకుంటారు.
మనుషులలో డయాబెటిస్ లాంటి రోగాలు ఎలా ఉంటాయో అలాగే ఎలుకలలో కూడా ఉంటాయి. వీటి పై ముందుగా పరిశోధన చేసి, ఒకవేళ అవి నయం అయినట్లయితే మానవులకు కూడా ఈ మందులతో నయం చేయడం జరుగుతుంది.
మరి మిగతా జంతువులూ కూడా ఉన్నాయి కదా ఎలుకలే ఎందుకు ? మిగతా జంతువులను పరిశోధన కోసం తీసుకోవడం కష్టం అవుతుంది ఎందుకంటే పరిశోధన సమయంలో చాలా వరకు జంతువులకు కోపం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎలుకలు ఐతే కోపం వచ్చిన వాటిని కంట్రోల్ చేయవచ్చు.
ఇంతే కాకుండా ఎలుకలు చాలా త్వరగా పిల్లలను కనడం జరుగుతుంది, చిన్న చిన్న బోన్లలో సులువుగా పెట్టవచ్చు. ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి వెళ్లాలన్న సులువుగా తీసుకువెళ్ళవచ్చు.
ముఖ్యంగా ఎలుకల జీవిత కాలం కూడా చాలా తక్కువగా ఉండటం వల్ల ageing ప్రాసెస్ ను కూడా బాగా అధ్యయనం చేయవచ్చు. ఎందుకని మనము ముసలి వాళ్ళ లాగ మారిపోతాం, ఎల్లప్పుడూ యవ్వనంగా ఉండాలంటే ఏం చెయ్యాలి అనే విషయాల మీద పరిశోధన చెయ్యాలి అంటే ఎలుకలు ఒక మంచి ఉదాహరణ అని చెప్పవచ్చు.
Disclaimer (గమనిక ):
తెలుగు రీడర్ లో చేర్చబడిన సమాచారం కేవలం మీకు ఒక విషయం పై అవగాహన కలిగించటానికి మాత్రమే ఇవ్వబడుతుంది. ఇక్కడ ఇవ్వబడిన సమాచారం డాక్టర్ మరియు హాస్పిటల్ కి ప్రత్యామ్నాయం కాదు. పై తెలుపబడిన సమాచారం క్షుణ్ణంగా పరిశీలించి, ఆయా విభాగాలలో ఉన్న నిపుణుల సోర్సెస్ ద్వారా వెబ్ సైట్ లో రాయడం జరుగుతుంది. మీకు వ్యక్తిగతంగా వచ్చే సందేహాలను దూరం చేయటానికి దయచేసి డాక్టర్ తో సంప్రదించండి.
Leave a Reply